అలా ఎందుకు జరిగిందో వివరణ ఇచ్చిన అమెరికా

వాస్తవం ప్రతినిధి: ఇటీవల అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పాకిస్తాన్‌ ప్రధాని షాహిద్‌ అబ్బాసీ ని భద్రతా తనిఖీలు ఎదుర్కొన్నారన్న వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వార్తలు వెలువడడమే కాకుండా దానికి సంబందించిన వీడియో కూడా ఒకటి వైరల్ అయ్యింది. దీనితో అమెరికా వ్యవహరించిన తీరుపై పాక్ గుర్రుగా ఉంది. ఈ నేపధ్యంలో అమెరికా స్పందించింది. తాము ఎందుకు అలా  వ్యవహరించాల్సి వచ్చిందో అమెరికా అధికారులు గురువారం వెల్లడించారు. పా​క్‌ ప్రధాని వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికా వచ్చారని, ఒకవేళ అధికారిక పర్యటన అయితే దానికి సంబందించిన ఏర్పాట్లు వేరుగా ఉండేవని, మిగిలిన ప్రయాణికుల మాదిరే ఆయన కూడా భద్రతా ప్రమాణాలు పాటించాలని..అందుకే తాము అబ్బాసీని కూడా తనిఖీ చేసామని, వ్యక్తిగత పర్యటనలు చేసేవారు ఎవరైనా ఇందుకు మినహాయింపు కాదని యూఎస్‌ డిప్యూటీ ప్రతినిధి అలెగ్జాండర్‌ మెక్‌లారెన్‌ మీడియాకు వెల్లడించారు. పాక్‌ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం అబ్బాసీ అనారోగ్యంతో ఉన్న తన సోదరిని సందర్శించడానికి అమెరికా వెళ్లారు.