అభిమాని కోసంగా మోకాళ్లపై కూర్చొని..

వాస్తవం సినిమా: ప్రభాస్ మనసు వెన్న అనే విషయం చాలామార్లు నిరూపితమైంది. తాను ఎంత పెద్ద స్టార్ అయినా ఒదిగి ఉండటమనేది ప్రభాస్ లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. గతంలో తన ఫ్రెండ్స్ తో ఎలా వుండేవాడో ఇప్పటికీ వాళ్లతో ఆయన అలాగే వుంటాడు. సెట్లో చాలా సహనంతో వుండటమే కాదు .. తనని కలుసుకోవడానికి వచ్చిన అభిమానులతో ఆయన అంతే ఆత్మీయంగా ఉంటాడని అంటారు. తాజాగా అదే విషయం మరోమారు స్పష్టమైంది. అంగవైకల్యం వున్న ఓ అభిమాని .. రీసెంట్ గా ప్రభాస్ ను కలుసుకున్నాడు. ప్రభాస్ తో సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడ్డాడు. అయితే ఈ విషయంలోనే ఆయన ఇబ్బంది పడ్డాడు. దాంతో ఆ అభిమాని ముచ్చట తీర్చడం కోసం ప్రభాస్ మోకాళ్లపై కూర్చుని సెల్ఫీ దిగాడు. దాంతో ఆ అభిమాని ఆనందం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ‘సాహో’ చేస్తోన్న ప్రభాస్, ఆ తరువాత కృష్ణంరాజు బ్యానర్లో ఓ మూవీ చేయనున్నాడు.