అటల్ మృతి చెందినట్లు సోషల్ మీడియా లో వైరల్ అయిన న్యూస్

వాస్తవం ప్రతినిధి: భారత మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ యోధుల్లో ఒకరైన అటల్ బిహారీ వాజ్‌పేయి(93) మరణించినట్లు సోషల్‌మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ విధంగా వాజ్ పేయి మరణించినట్లు 2015 లో కూడా వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సహోద్యపకుడు అందించిన సమాచారం తో స్కూలు కు సెలవు కూడా ప్రకటించారు ఒక హెడ్ మాస్టర్. ఈ విధంగా సెలవు ప్రకటించిన హెడ్ మాస్టర్ పై కలక్టర్ కూడా చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా లో మరోసారి అటల్ జీ మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా వేదికల ద్వారా షేర్‌ అవుతోన్న పోస్టు మరణానికి రకరకాల కారణాలను పేర్కొంది.