అఖిల్ సరసన చాన్స్ కొట్టేసిన మేఘా ఆకాశ్

వాస్తవం సినిమా: వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనుంది. ఈ సినిమాలో కొత్త కథానాయికను కాకుండా .. మంచి క్రేజ్ వున్న యంగ్ హీరోయిన్ ను తీసుకోవాలనే ఆలోచనలో వెంకీ అట్లూరి .. నాగార్జున వున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కొత్త హీరోయిన్స్ కలిసి రానందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా మేఘా ఆకాశ్ నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ‘లై’ సినిమా పరాజయం పాలైనా యూత్ హృదయాలను మేఘా ఆకాశ్ కొల్లగొట్టేసింది. ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాతో వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందనీ .. అది తమ సినిమాకి కలిసొస్తుందని వెంకీ అట్లూరి భావిస్తున్నాడు.