సోనియా గాంధీతో భేటీ అయిన మమతా బెనర్జీ

వాస్తవం ప్రతినిధి:  ఢిల్లీలో పలు పార్టీల కీలక నేతలతో చర్చలు జరుపుతోన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. 10 జన్‌పథ్‌లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించారు. అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ… తాను ఢిల్లీకి ఎప్పుడొచ్చినా సోనియా గాంధీని కలుస్తుంటానని అన్నారు. సోనియా గాంధీతో మాట్లాడి ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నానని, అలాగే దేశ రాజకీయాలపై చర్చించానని తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీలు కలిసి పోరాడాల్సిన విషయంపై మాట్లాడుకున్నామని, అన్ని పార్టీలు కలిస్తే బీజేపీని రాజకీయాల్లోంచే తొలగించవచ్చని చెప్పారు.