మెగాస్టార్‌తో కలిసి పనిచేయడమనేది ఓ కల : సుకుమార్

వాస్తవం సినిమా: “చిరంజీవితో సినిమా తీసే అవకాశం అనేది నిజంగా అద్భుతమైన ఛాన్స్. ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్త కేవలం గాసిప్ మాత్రమే. చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. మెగాస్టార్‌తో కలిసి పనిచేయడమనేది ఓ కల ” అని సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ అన్నారు. సుకుమర్ దర్శకత్వంలో రాంచరణ్, సమంతతో రూపొందించిన చిత్రం రంగస్థలం సినిమా రిలీజ్ సిద్ధమవుతున్న నేపథ్యంలో .. రంగస్థలం చిత్రం తర్వాత సుకుమార్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ విషయంపై సుకుమార్ స్పందించారు. చిరంజీవితో సినిమా రూపొందించాలనే ఆశ ఉంది. కానీ ఇప్పటివరకు ఆయనను సంప్రదించలేదు. అవకాశం వస్తే చిరంజీవితో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు సుకుమార్.