మియామీ లో విహ‌రిస్తున్న చై-సామ్ జోడీ

వాస్తవం సినిమా: అక్కినేని నాగచైతన్య- సమంత ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్ హీట్ నుంచి స్కిప్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. అమెరికా- మియామీ లో విహ‌రిస్తోంది ఈ జంట‌. ఈ విష‌యాన్ని సామ్ స్వ‌యంగా ఫోటోలను ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేయ‌డం ద్వారా వెల్ల‌డించారు. మియామి-విన్‌వుడ్ ప‌రిస‌రాల్లో వాల్‌ పెయింటింగ్‌ దగ్గర చై-సామ్ ఫోటో దిగారు. ఈ ఫోటో ఆద‌ర్శ‌జంట చై – సామ్ మ‌ధ్య‌ ప్రేమాప్యాయ‌త‌ల‌కు చిహ్నంగా క‌నిపిస్తోంది. చై స్మైల్ ఇస్తుంటే, త‌న‌నే త‌ధేకంగా చూస్తోంది సామ్‌.

మియామీలో విన్‌వుడ్‌ వాల్స్ ప్ర‌త్యేకించి డిజైన్ చేసిన సంద‌ర్శ‌కుల ఔట్‌డోర్‌ మ్యూజియం. అక్కడ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్‌ కళాకారుల చిత్రాలను ప్రదర్శిస్తారు. అమెరికాలో రెండు వారాల ట్రిప్ త‌ర‌వాత ఈ జంట ఇండియాకి వ‌చ్చి తిరిగి పెండింగ్ ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోతారు. ఇప్ప‌టికే చై రెండు మూడు సినిమాల‌తో బిజీ. స‌మంత స‌న్నివేశం ఇంచుమించు అదే తీరుగా ఉంది. మ‌రోవైపు భార్యాభ‌ర్త‌లిరువురూ క‌లిసి ఒకే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి విదిత‌మే.