బీహార్ లో నితీష్ పాలన అంతం: లాలూ

వాస్తవం ప్రతినిధి: బీహార్‌లో నితీశ్ కుమార్ పాలన అంతమవుతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఇటీవల నాలుగు దాణా కుంభకోణం కేసులలో దోషిగా తేలి ప్రస్తుతం లాలూ బిర్సా ముండా జైలు లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అస్వస్థతకు గురవ్వడం తో ఇటీవల ఆసుపత్రిలో అడ్మిట్ అయి,డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరోసారి చికిత్స నిమిత్తం ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ నితీష్ పాలన అంతం అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా బీహార్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా అల్లర్లు, హింస చోటుచేసుకుంటున్నట్లు లాలూ ఆరోపించారు. బీజేపీ పార్టీ రాష్ట్రాన్ని కుంప‌టిగా మార్చేస్తోంద‌ని లాలూ ఆరోపించారు.