‘నాకు ఒకే ఒక కోరిక ఉంది’: రాఘవేంద్రరావు

వాస్తవం సినిమా: నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రంలో తనకు ఒక్క షాట్ లోనైనా నటించే అవకాశం ఇవ్వాలని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలకృష్ణను కోరారు. ఈ ఉదయం బయోపిక్ ప్రారంభమైన తరువాత మీడియాతో మాట్లాడిన రాఘవేంద్రరావు, ఓ యుగపురుషుడి చరిత్రను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నప్పుడే బాలకృష్ణ జీవితం ధన్యమైందని అన్నారు. తనకు ఒకే కోరిక ఉందని, దాన్ని తేజ, బాలయ్య తీర్చాలని చెబుతూ, ఈ సినిమాలో ఎన్టీఆర్ పై కనీసం ఒక్క షాట్ ను తాను దర్శకత్వం వహిస్తున్నట్టు చిత్రీకరించాలని కోరారు. దీనికి బాలకృష్ణ సభా వేదికపైనే తన అంగీకారాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ తో పాటు అంబికా కృష్ణ, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.