చైనా లో పూర్తి అయిన అత్యంత పొడవైన సముద్ర వంతెన

వాస్తవం ప్రతినిధి: చైనా లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన నిర్మాణం పూర్తి అయినట్లు తెలుస్తుంది. దక్షిణ చైనాలోని గ్జాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లో నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే పొడవైన సముద్ర వంతెన ఇది. దాదాపు 55 కిలోమీటర్ల పొడవైన ఈ నిర్మాణంలో 23 కిలోమీటర్ల వంతెనలు, 6.7 కిలోమీటర్ల సొరంగాలు, రెండు కృత్రిమ ద్వీపాలు ఉన్నాయి. నిర్మాణం పూర్తైన ఈ వంతెన ను జులైలో పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తుంది.