కేంద్రంపై విరుచుకుపడ్డ ఉండవల్లి

వాస్తవం ప్రతినిధి: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి కేంద్రం పై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చకు ప్రధాని మోడీ ఎందుకు భయపడుతున్నారో తెలియడం లేదని అరుణ్‌కుమార్‌ అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. బిజెపికి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ మోడీ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపధ్యంలో  అవిశ్వాసంపై చర్చ జరిగేలా స్పీకర్‌ చొరవ చూపాలని ఆయన అన్నారు. లోక్‌సభలో ఆందోళన చేస్తున్న వారిని సస్పెండ్‌ చేసైనా చర్చ చేపట్టాలన్నారు. అలానే ఏపీ సి ఎం చంద్రబాబు పై కూడా ఆయన విమర్శలు చేశారు. ప్రజలను ఏమార్చడంలో ఏపి సి ఎం చంద్రబాబు దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారని, చంద్రబాబు ఏరు దాటాకా తెప్ప తగలేసే రకమంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలకు నిజాలు చెప్పడం లేదన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఢిల్లీకి వచ్చి చంద్రబాబు పోరాడాలని ఉండవల్లి పిలుపు నిచ్చారు.