ఏప్రిల్ 4, 5 తేదీల్లో విజయవాడకు పవన్‌కల్యాణ్‌

వాస్తవం ప్రతినిధి:ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ అందుకోసంగా పోరాట కార్యాచరణ ఖరారు చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 4, 5 తేదీల్లో విజయవాడకు వెళ్లి తమ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు జరపనున్నారు. అలాగే, జనసేన పార్టీని బలోపేతం చేసే అంశంపై కూడా తమ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తమ పార్టీ కార్యవర్గం, పలు విభాగాలకు అధ్యక్షుల నియామకం వంటి వాటిపై కీలక చర్చలు జరుపుతారు. ఇటీవలే పవన్ కల్యాణ్ విజయవాడకు వెళ్లి వామపక్ష నేతలతో చర్చించిన విషయం తెలిసిందే.