ఉత్తర కొరియా హామీ ని స్వాగతించిన గుటేరాస్

వాస్తవం ప్రతినిధి: అణు నిరాయుధీకరణకు కట్టుబడి వున్నామని ఉత్తర కొరియా హామీ ఇచ్చినట్లుగా చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ స్వాగతించారని గుటేరస్ ప్రతినిధి ఫర్హాన్ హక్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సానుకూల పరిణామాలను నిజాయితీతో కూడిన సుదీర్ఘ చర్చల క్రమానికి ప్రారంభంగా ఐరాస చీఫ్‌ పేర్కొన్నారు. అంతిమంగా కొరియా ద్వీపకల్పంలో సుస్థిర శాంతి నెలకొనడానికి, అణు నిరాయుధీకరణకు దారి తీయగలదని భావిస్తున్నట్లు చెప్పారు.