అత్యంత ప్రభావ శీలుర జాబితా లో మరోసారి మోదీ పేరు!

వాస్తవం ప్రతినిధి: టైమ్స్ మ్యాగజైన్ ప్రభావ శీలుర జాబితా లో మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తుంది. మ్యాగజైన్‌ టైమ్స్‌ ఏటా విడుదల చేసే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత నరేంద్రమోదీ పేరు మరోసారి పరిశీలనకు వచ్చింది. 2015, 2016, 2017లో విడుదల చేసిన ప్రభావశీలుల జాబితాలోనూ ప్రధాని మోదీ స్థానం సంపాదించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రభావితం చేసే ప్రముఖ రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణలతో ఏటా ప్రభావశీలుర జాబితాను టైమ్స్ మ్యాగజైన్ విడుదల చేస్తున్నట్ సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ జాబితా లో మోదీ సహ పలువురు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రభావశీలుల జాబితాలో చోటు కోసం మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌, ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, బ్రిటన్‌ రాజ కుటుంబీకులు ప్రిన్స్‌ విలియమ్‌, కేట్‌ మిడిల్టన్‌, ప్రిన్స్‌ హ్యారీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తదితరులు పోటీ పడుతున్నట్లు సమాచారం.