సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా పతాకంపై ‘గులేబకావళి’

వాస్తవం సినిమా:కల్యాణ్ దర్శకత్వం లో ప్రభుదేవా కథానాయకుడిగా, హన్సిక కథానాయిక గా సీనియర్ నటి రేవతి ప్రధాన పాత్ర లోనటించిన చిత్రం ‘గులేబకావళి’. తమిళంలో సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం, అక్కడ మంచి టాక్‌ అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళ టైటిల్‌తోనే సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఏప్రిల్ 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ‘తమిళంలో హిట్‌ అయిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మి, తెలుగులోకి అనువదిస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు, ప్రభుదేవా డ్యాన్స్‌కు మంచి స్పందన వస్తోంది. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి స్టంట్స్: పీటర్ హెయిన్స్, సంగీతం: వివేక్ మెర్విన్, కెమెరా: ఆర్‌.ఎస్ ఆనంద్‌ కుమార్.