విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు

వాస్తవం ప్రతినిధి:  సిఎం చంద్రబాబుపై ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ సి ఎం చంద్రబాబు కూడా విజయ సాయి రెడ్డి పై మండిపడ్డారు. అయితే ఏపీ సి ఎం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపి విజయసాయిరెడ్డిని వెంటనే అరెస్ట్‌ చేయాలని గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌కు టిడిపి నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. సిఎం స్థాయి వ్యక్తిపై ఈ తరహా వ్యాఖ్యలు భవిష్యత్తులోనూ ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందన్నారు. వైసిపి నేతలు స్పప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, అసలు ఆయన వైఖరి ఎంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని వారు అన్నారు.