లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మూడో పెళ్ళి చేసుకుంటున్నాడట!

వాస్తవం ప్రతినిధి: బ్యాంకులకు 9000 కోట్లు ఎగ్గొట్టి లండన్ కి చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మూడో పెళ్ళికి సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పింకీ లాల్వానీ అనే యువతితో మాల్యా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 2011లో పింకీకి.. మాల్యా తాను యజమానిగా వ్యవహరించిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లో ఉద్యోగం ఇప్పించారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం లండన్ లో ఉంటున్న మాల్యా కు తోడుగా పింకీ నే అన్నీ దగ్గరుండి చూసుకుంటుందట. అంతేకాకుండా కోర్పు తీర్పులకు కూడా ఇద్దరూ కలిసే వెళుతున్నారట. మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మాల్యాకు ఇది మూడో వివాహం అవుతుంది. తొలుత మాల్యా ఎయిర్‌ ఇండియా మాజీ ఎయిర్‌ హోస్టెస్‌ సమీరా త్యాబ్జీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక మగ బిడ్డ పుట్టాక ఇద్దరూ విడిపోవడం తో మాల్యా తన చిన్ననాటి స్నేహితురాలు రేఖను వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా పింకీ ని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది.