రెండోపెళ్ళి చేసుకున్న ఎంపీ శశికళ పుష్ప

వాస్తవం ప్రతినిధి: అన్నాడీఎంకే బహిష్కృత నేతరాజ్యసభ ఎంపీ శశికళ పుష్ప(41), న్యాయవాది రామస్వామిల వివాహం నిన్న ఢిల్లీలో జరిగింది. : కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ రాజ్యసభ మహిళా ఎంపీ రెండో పెళ్లి చేసుకున్న ఘటన ప్రస్తుతం తమిళనాట సంచలనం సృష్టించింది. మొదటి భర్త లింగేశ్వరతో విభేదాల కారణంగా గతంలోనే ఆమె విడాకులు తీసుకున్నారు. అయితే ఆమె తాజాగా ఢిల్లీ కి చెందిన న్యాయవాది రామస్వామి(47)ని ఈ నెల 26న రెండో పెళ్లి చేసుకోనున్నట్టు సామాజిక మాధ్యమాల్లో శుభలేఖ ప్రత్యక్షమైంది. అయితే రామస్వామికి గతంలోనే పెళ్లి జరిగిందని మదురై విల్లాపురానికి చెందిన సత్యప్రియ అనే మహిళ మదురై కలక్టర్ కు ఫిర్యాదు కూడా చేసింది. 2014 లో మా పెళ్లి జరిగింది మాకు ఏడాది పాప కూడా ఉన్నట్లు ఆమె మదురై హైకోర్టు లో ఫిర్యాదు చేయడం తో విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ కేసు విచారణ ముగిసే వరకు రామస్వామి ఎవరినీ వివాహం చేసుకోవద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వారిద్దరూ ఘనంగా బహిరంగంగా వివాహం చేసుకోవడం ఇప్పుడు తమిళనాట సంచలనమైంది.