రాజమౌళి సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో రాజశేఖర్

వాస్తవం సినిమా: రాజమౌళి తరువాత సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. తాను చేయాలనుకున్న మల్టీ స్టారర్ కోసం ఇప్పటికే చాలా సమయం తీసుకున్న రాజమౌళి, అక్టోబర్లో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే విధంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకోసం ఒక వైపున ఎన్టీఆర్ .. మరో వైపున చరణ్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో హీరో పాత్రలకు దీటుగా విలన్‌ పాత్రలూ ఉంటాయి. ఈ సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌ అయితేనే బాగుంటుంది అని జక్కన్న భావించారట.బాక్సింగ్‌ నేపథ్యంలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. తారక్‌, చరణ్‌ పాత్రలకు సంబంధించి ఇటీవల అమెరికాలో ఫొటో షూట్‌ చేశారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

.