యాషెస్ లో కూడా ట్యాంపరింగ్ జరిగింది: ఇంగ్లాండ్ మాజీ సారధి

వాస్తవం ప్రతినిధి: 2017 యాషెస్ సిరీస్ లో కూడా ఆసీస్ జట్టు ట్యాంపరింగ్ కి పాల్పడింది అంటూ ఇంగ్లాండ్ జట్టు మాజీ సారధి మిచెల్ వాగన్ వ్యాఖ్యానించారు. తన సారథ్యంలో తొలిసారిగా బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు స్టీవ్‌ స్మిత్‌ చెప్తున్న మాట్లలో వాస్తవం లేదని యాషెస్‌ సిరీస్‌లోనూ స్టీవ్‌ స్మిత్‌ ఆధ్వర్యంలో బాల్‌ టాంపరింగ్‌ జరిగినట్లు మిచెల్ ఆరోపించారు. ఇది కచ్చితంగా నిజం. ఆస్ట్రేలియా గత యాషెస్‌ సిరీస్‌లోనూ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడింది. కానీ 4-0తేడాతో ఇంగ్లాండ్‌ యాషెస్‌ సిరీస్‌ను కోల్పోవడానికి మాత్రం ఇది కారణం కాదని ఓ ప్రముఖ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్‌ వాగన్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం స్టీవ్‌ స్మిత్‌ చెప్పిన మాటలను నేను విశ్వసించను. కచ్చితంగా గత యాషెస్‌ సిరీస్‌లో కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు టాంపరింగ్‌కు పాల్పడ్డారు. అది ఎవరో కూడా వారికి తెలుసు, ఇప్పుడు వాళ్ల పేర్లు బయటపెట్టడం అనవసరమని మిచెల్ అంటున్నాడు.