మయన్మార్ నూతన అధ్యక్షుడిగా సూకీ సన్నిహితుడు!

వాస్తవం ప్రతినిధి: మయన్మార్‌ నూతన అధ్యక్షుడిగా విన్ మింట్ ను ఆ దేశ పార్లమెంట్ ఎన్నుకుంది. ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్‌ సూకీ కి విన్ మింట్ సన్నిహితుడే. అయితే ఆమె సన్నిహితుడు ఎన్నికైనప్పటికీ సూకీ ప్రభుత్వ సలహాదారుగా అత్యున్నత అధికార స్థాయిలోనే కొనసాగుతారని సూకీ సన్నిహితులు చెప్పారు. 1951లో ఇరావడ్డీ డెల్టాలో జన్మించిన విన్‌మింట్‌ యాంగాన్‌ యూనివర్శిటీ నుండి భౌగోళిక శాస్త్రంలో డిగ్రీ పొందిన తరువాత న్యాయశాస్త్రంలోనూ పట్టభద్రుడై న్యాయవాద వృత్తిని స్వీకరించారు. సూకీ నేతృత్వంలో ఏర్పాటయిన ఎన్‌ఎల్‌డిలో క్రియాశీలకంగా వ్యవహరించిన మింట్‌ 1988లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమంలో కొంతకాలం జైలు జీవితాన్ని అనుభవించిన ఆయన 2010లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు.