మత ఘర్షణలలో 125 మంది అరెస్ట్!

వాస్తవం ప్రతినిధి: బీహార్‌లోని జౌరంగాబాద్‌లో శ్రీరామనవమి వేడుకల్లో మత ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల నేపధ్యంలో అక్కడి డీజీ గుప్తేశ్వర్ పాండే ఇప్పటికి 125 మందిని అరెస్టు చేశామని తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మవద్దు, నిందితులు తప్పించుకోలేరు, 125 మందిని అరెస్టు చేశాం. మరి కొంత మందిని అరెస్టు చేస్తాం అని ఆయన తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని తెలిపారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గన్న కొందరు 50 షాపులను దహనం చేశారు. దుండగులు రాళ్లు రువ్వగా పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనల నేపధ్యంలో అక్కడి అధికారులు 125 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.