భార్యను కలిసేందుకు నిరాకరించిన షమి

వాస్తవం ప్రతినిధి: ఇటీవల టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ కి ఆదివారం తిరుగు ప్రయాణం అయిన సమయంలో షమి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో ష మి కి గాయాలు కావడం తో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ష మి శారీరకంగా గాయపడాలని తాను కోరుకోవడం లేదని, గాయపడిన షమి ని చూడాలనుకుంటున్నానని మంగళవారం మీడియా తో మాట్లాడుతూ షమి భార్య హసీన్ జహాన్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నేను ఇప్పటికీ అతణ్ని ప్రేమిస్తున్నా. అతడు నా భర్త, అతడు త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తా. నా కూతురితో కలిసి అతడిని కలవాలనుకుంటున్నట్లుఆమె పేర్కొన్నారు. అయితే జహాన్‌ అభ్యర్థనను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షమి తిరస్కరించినట్లు తెలుస్తుంది. తనను కలిసేందుకు షమి సిద్ధంగా లేనట్లు జహాన్‌ వివరించారు.

అంతకుముందు మహ్మద్‌ షమి అతని భార్య హసీన్‌ జహాన్‌, కూతురితో ఘజియాబాద్‌లోని ఓ హోటల్‌లో మంగళవారం కలుసుకున్నట్లు దానికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అయితే దానిపై స్పందించిన జహాన్‌ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, షమి తనను ఆసుపత్రిలో కలిసేందుకు అంగీకరించలేదని,ఏదైనా ఉంటె కోర్టులోనే చూసుకుందాం అని చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.