బీజేపీ అసమ్మతి నేతలతో మమత భేటీ!

వాస్తవం ప్రతినిధి: ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ని గద్దె దింపాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆమె తాజాగా బిజెపి అసమ్మతివాద నేతలతో సమావేశమైనట్లు తెలుస్తుంది. బిజెపి అసమ్మతివాద నేతలు శతృఘ్నసిన్హా, యశ్వంత్‌సిన్హా, అరుణ్‌ శౌరిలతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఆమెతోపాటు పార్లమెంటు సభ్యుడు డెరిక్‌ ఒబ్రీన్‌ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే వారితో ఎలాంటి విషయాలపై చర్చిస్తున్నారు, వంటి వివరాలు మాత్రం తెలియరాలేదు.  బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయడం కోసం మమతా బెనర్జీ కొద్ది రోజులుగా కృషి చేస్తున్న విషయం విదితమే. ఈ నేపధ్యంలోనే బీజేపీ అసమ్మతి నేతలతో ఆమె భేటీ అయినట్లు తెలుస్తుంది.