ఫోర్బ్స్ జాబితా లో సింధు,స్మృతి మంధాన!

వాస్తవం ప్రతినిధి:  ఫోర్బ్స్‌ ఆసియా ప్రతిభావంతుల జాబితాలో ఇద్దరు భారత మహిళా క్రీడాకారులకు చోటుదక్కింది. వారు ఎవరంటే స్టార్‌ షట్లర్‌ సింధు, భారత మహిళల జట్టు ఓపెనర్‌ స్మృతి మంధాన. ఆసియాలో వివిధ రంగాల్లో తమ ముద్ర వేసిన 30 ఏళ్లలోపు యువత విభాగంలో ఫోర్బ్స్‌ 30 మందితో ఈ జాబితా ప్రకటించగా ఆ జాబితా లో సింధు కి, స్మృతి మంధాన కి స్థానం దక్కింది. అలానే వినోదం, క్రీడలు విభాగంలో భారత్‌ నుంచి బాలీవుడ్‌ నటి, నిర్మాత అనుష్కశర్మ జాతీయ పోలో జట్టు కెప్టెన్‌ పద్మనాభ్‌ సింగ్‌కు కూడా ఈ జాబితా లో స్థానం లభించినట్లు తెలుస్తుంది.