ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్ ల సీఇఓ లకు సమన్లు!

వాస్తవం ప్రతినిధి: వినియోగదారుల డేటా దుర్వినియోగమైందని ఫేస్ బుక్,గూగుల్,ట్విట్టర్ ల పై ఆరోపణలు వస్తున్న సంగతి  తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ సంస్థల సిఇఓ లకు అమెరికన్ కాంగ్రెస్ కమిటీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తుంది. దీంతో డేటా గోప్యతపై విచారణకు మార్క్‌ జుకర్‌బర్గ్‌, సుందర్‌ పిచ్చరు, జాక్‌ డోర్సేలు హాజరు కానున్నారు. ఏప్రిల్‌ 10న సెనెట్‌ జ్యుడీషియరీ కమిటీ ఈ విచారణ నిర్వహించనుంది. వినియోగదారుల డేటా రక్షణ, పర్యవేక్షణలకు సంబంధించి గతంలో తీసుకున్న, భవిష్యత్తులో తీసుకోనున్న విధానాలపై జుకర్‌బర్గ్‌ తో,పిచ్చర్,డార్సే లతో  చర్చించనున్నట్లు కమిటీ చైర్మన్‌ చుక్‌ గ్రాస్లే తెలిపారు. వాణిజ్యపరమైన ప్రయోజనాలకు వినియోగదారుల డేటాను సమీకరించడం, నిల్వ చేసుకోవడం, వ్యాప్తి చేయడానికి అనుసరించే గోప్యతా ప్రామాణికాల గురించి వారిని విచారించనున్నారు.