పాక్ ప్రధానికి అమెరికా లో అవమానం!

వాస్తవం ప్రతినిధి:  పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షాహిద్‌ ఖకాన్‌ అబ్బాసీకి అమెరికాలో అవమానం జరిగింది. ఇటీవల అమెరికా లో పర్యటించిన ఆయన న్యూయార్క్‌ లోని జాన్‌ ఎఫ్‌ కెన్నడీ ఎయిర్‌పోర్టు లో సామాన్య పౌరుడి లా దుస్తులు తీయించి తనిఖీలు చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబందించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేయడం తో అమెరికా తీరుపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఎయిర్‌పోర్టులో అబ్బాసీ కోటు, బెల్టు తీయించి సిబ్బంది తనిఖీలు చేసిన వీడియో పాకిస్థాన్‌ టీవీ ఛానళ్లలో ప్రసారమైంది. అయితే అబ్బాసీ వ్యక్తిగత పర్యటన నిమిత్తం  సోదరిని చూడడానికి అమెరికా వెళ్లారని, ఈ నేపధ్యంలో ఆయన సామాన్య పౌరుడి లా స్వచ్చందంగా సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటించారరంటూ ఇది ప్రధాని నిరాడంబరత్వానికి నిదర్సనం అంటూ పాక్ మీడియా పేర్కొంది. పాక్‌ దేశస్థులపై అమెరికా ఆంక్షలు విధించాలని చూస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని.. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అమెరికా పలుసార్లు పాక్ ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాక్ ప్రధానికి అమెరికా లో ఆవమానం జరగడం తో పాక్ మీడియా అగ్రరాజ్యం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది.