ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం

వాస్తవం ప్రతినిధి: ద్రవ్య వినిమయ బిల్లుకు ఈ రోజు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది.  మంగళవారం   సభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ద్రవ్య వినిమయ బిల్లు-2018 (2018 ఎల్‌ఏ బిల్ నం.7)నుఆ తరువాత తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2018 (నంబర్-2) (2018 ఎల్‌ఏ బిల్ నంబర్ 8) ను ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై సభ్యులు ప్రశ్నించగా, సీఎం కేసీఆర్ సభ్యులకు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. సీఎం ప్రసంగం ముగిసిన అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపడం తో చట్టసభల్లో వార్షిక బడ్జెట్ (2018-19) కు ఆమోదం లభించినట్లు అయ్యింది.