తిరుమల లో అగ్నిప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: తిరుమల లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి బూంది పోటులో ఈ ప్రమాదం జరిగింది. దీంతో బూంది పోటులో మంటలు భారీగా ఎగసిపడడం తో వెంటనే రంగంలోకి దిగిన రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేసినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి చక్కబడినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎంత మేరకు నష్టం వాటిల్లింది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.