డాక్టర్ దుర్గారావుకు ఉత్తమ సేవకుడి అవార్డు

వాస్తవం ప్రతినిధి: వజ్రపు కొత్తూరు మహాదేవపుర గ్రామానికి చెందిన జనసేన నాయకుడు డాక్టర్ దుర్గా రావు కు అమెరికాకు చెందిన వాస్తవం మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సమాజసేవకు గుర్తింపుగా ఈ ఏడాదికి ఉత్తమ సేవకుడు అవార్డు ప్రకటించింది. ప్రధానంగా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పదిహేడేళ్లుగా అందిస్తున్న సేవలు,విశాఖపట్నం జిల్లా చింతపల్లి,తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం,ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు గాను ఈ అవార్డుకు ఎంపికైనట్లు దుర్గారావు కు తెలిపారు. ఏప్రిల్ లో జరిగే వార్షికోత్సవంలో ఈ అవార్డును ఆయనకు అందించనున్నట్లు వాస్తవం మీడియా అండ్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలిపింది.