చత్తీస్ ఘడ్ లో హత్యకు గురైన బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు!

వాస్తవం ప్రతినిధి: బీజేపీ చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా మాజీ అధ్యక్షుడు జగదీశ్ కొండర హత్యకు గురయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భోపాలపట్నంలో ఆయన హత్యకు గురైనట్లు తెలుస్తుంది. అయితే ఇది మావోయిస్టుల పనే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధికి సుమారు 300 మీటర్ల దూరంలోనే జగదీష్ హత్యకు గురయ్యారు. అయితే జగదీష్‌ని ఎవరైనా పాతకక్షల కారణంగా హత్య చేశారా..? లేక మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా..? అనే విషయంపై పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు, పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.