కోలుకుంటున్న నటి జయంతి ఆరోగ్యం

వాస్తవం సినిమా: శ్వాస సంబంధమైన వ్యాధితో కొంత కాలంగా బాధపడుతోన్న సీనియర్ నటి జయంతి (74) మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆమెను కుటుంబసభ్యులు బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని, ప్రస్తుతం కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. జయంతి తనయుడు కృష్ణ‌కుమార్‌ మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా ఆస్థమాతో బాధపడుతోన్న అమ్మ ఏ రోజూ వైద్యం కోసం హాస్పిటల్‌కు వెళ్లలేదని, సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. 24 గంటల పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు చెప్పారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని కృష్ణ‌కుమార్‌ తెలియజేశారు. ఆస్పత్రిలో చేరిన కాసేపటికే కోలుకున్నారని, బుధవారం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలిస్తారని తెలిపారు. మరో రెండు రోజుల్లో జయంతి పూర్తిగా కోలుకుంటారని వైద్యులు పేర్కొన్నారు.