కొణిదెల కుటుంబసభ్యుల అనుబంధం..

వాస్తవం సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న కుటుంబసభ్యులతో కలిసి తన పుట్టినరోజు సంతోషంగా జరుపుకున్నారు. 33వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు. తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖతో పాటు బాబాయ్ పవన్ కల్యాణ్ ల మధ్య రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు. ఈ సందర్భంగా చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్, చెర్రీకి బర్త్ డే శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను రామ్ చరణ్ భార్య ఉపాసన తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘కొణిదెల కుటుంబసభ్యుల అనుబంధం..అత్తమ్మ వండిన అద్భుతమైన లంచ్..హ్యాపీ బర్త్ డే మిస్టర్ సి’ అని ఆ పోస్ట్ లో ఉపాసన పేర్కొంది.