లేపాక్షి ఉత్సవాలకు దేశవిదేశాల్లోని అందరికీ స్వాగతం పలికిన బాలయ్య

వాస్తవం ప్రతినిధి: హిందూపురం నియోజకవర్గంలో లేపాక్షి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు అందరూ తరలి రావాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహ్వానించారు. దీనికి సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. “లేపాక్షి ఉత్సవాలకు దేశవిదేశాల్లో ఉన్న ప్రజలందరికీ సుస్వాగతం. లేపాక్షి ప్రాచుర్యం ప్రపంచ వ్యాప్తంగా ఎంత గొప్పగా ఉందో మీ అందరికీ తెలుసు. దాన్ని ప్రపంచీకరించి, టూరిజంను డెవలప్ చేయాలనే సదుద్దేశంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేపాక్షి పుణ్య స్థలంలో ఒక అద్భుతమైన ఉత్సవాన్ని ఒక తెలుగు పండుగలా జరుపుకోవడానికి నిర్ణయించింది. 2018 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఈ రెండు రోజులపాటు జరిగే పండుగలో మీరంతా పాల్గొని ఈ లేపాక్షి ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటూ… మీ నందమూరి బాలకృష్ణ” అంటూ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియో ద్వారా దేశవిదేశాల్లోని అందరికీ ఆహ్వానం పలికారు బాలయ్య.