జననాయకునికి స్వాగతం!

 వాస్తవం ప్రతినిధి: తన మామ ముఖ్యమంత్రి కాదు, తన దగ్గర లాక్కున్న అధికారం అనే కుర్చీ లేదు. తన తండ్రి ముఖ్యమంత్రి కాదు. అధికారంతోనో, వారసత్వముగానో సంపాదించిన లక్షల కోట్ల ఆస్తులు లేవు, అక్రమంగా సంపాదించుకొన్న కోట్లతో కోటలు కట్టుకొన్న మంది మార్బలం లేదు….

కేవలం తన అన్న భుజ స్కందాల మీద రాత్రనక పగలనక రక్తాన్ని చమటగా చిందించి సినీ ప్రపంచంలో మకుటంలేని మెగాస్టార్ గా ఎదిగిన ఒక సాధారణ అన్న చాటు అండన పెరిగిన అతి సామాన్య మనిషి, కర్తవ్యమే పరమా విధిగా బ్రతికిన మచ్చలేని నీతిగల నికార్సైన కానిస్టేబుల్ కొడుకు.

విధి ఆడిన వింత నాటకములో, రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి ఒక్క తాటిపైకి వచ్చి ఎలాగైనా మెగాస్టార్ స్థాపించిన ప్రజారాజ్యం ను పతనం చెయ్యాలని తలచి, కుల ముద్ర వేసి, పరకాల ప్రభాకర్ లాంటి కోవర్టు లను పంపి సీట్లు అమ్ముకున్నారని ముద్ర వేయించి, తనతండ్రి సమానులైన తన అన్న రాజకీయ విఫలం చెందారు అన్న అపవాదును గుదిబండలాగా మోస్తూ, ఆంధ్ర ప్రజలను మోసగించారు అన్న అపవాదు అనే అవమానాన్ని పంటి బిగువున భరిస్తూ……..

కుళ్ళు కుతంత్రాలతో నిండి వున్న ఈ తరం రాజకీయాలను చూస్తూ మనసులో ఏదో అలజడి తో సమాజానికి దూరంగా తనలో తాను మదన పడుతున్నా కానీ సమాజానిక ఏదో తన వంతుగా సేవ చేయాలనే తపన మాత్రమూ ఉన్నదీ. ఆ ఆలోచనలకు అభిమానుల అండ తోడై, ఆలోచన సరలికి పదును పెట్టుకొంటూ ప్రజల మధ్యకు రావాలన్న పట్టుదల తో వస్తున్న జననాయకునికి ….

కుల పిచ్చితో కాసులు సంపాదించి కడుపు నిండిన కుల పిచ్చొల్లు, అణగారిన వర్గాలు అయిన తాడిత పీడిత, బాధిత వర్గాలకి ఒకటి రెండు ఎంగిలి మెతుకులు లేదా జైలుకు పంపుతాం అని బెదిరిస్తూ, ఆంధ్ర ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచి ఉసరవెళ్ళి లాగ రోజుకొక రంగులు మార్చే అధికార పార్టీ అధిపతి కాదు…..తాను, తన బాబు, ఆ తరువాత తన మానవుడు తప్ప ఎవ్వరు కుర్చీలో కోర్చోకూడదు అనే ఎజెండా ఉండే బాబుల భరతం పడతాను అంటూ వస్తున్న జననాయకునికి…

తండ్రి చనిపోయిన నాటి నుండి నేటి వరకు సింగల్ డే అయినా సీఎం అవ్వాలి అనే సింగల్ఎజెండా తప్ప మరేది కానరాని ప్రతిపక్ష నాయకుడు కాదు.

ఢిల్లీలో కాళ్ళ బేరాలు, గల్లీల్లో ఘీంకారాలు చేస్తూ, మోసం చేస్తున్న మోసగాళ్ల మోసాలని బహిర్గతం  చేస్తాను అంటూ
వస్తున్న జననాయకునికి…. స్వాగతం!