రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ గా ముజుందార్

వాస్తవం ప్రతినిధి: రెండేళ్ల నిషేధం అనంతరం రాజస్థాన్‌ తిరిగి ఈ ఏడాది ఐపీఎల్‌లో పునరాగమనం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో ఎక్కువ ఫ్రాంఛైజీలు విదేశీ కోచ్‌ల బాట పడుతుంటే రాజస్థాన్‌ రాయల్స్‌ మాత్రం స్వదేశీ ఆటగాడినే బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా మాజీ క్రికెటర్‌ అమోల్‌ ముజుందార్‌ను ఎంపిక చేసినట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. ఈ నెల 13 నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్వహించే క్యాంపులో ముజుందార్‌ చేరతాడని ఫ్రాంఛైజీ తెలిపింది. ఇప్పటికే ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ని కెప్టెన్‌గా ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు బ్యాటింగ్ కోచ్ గా ముజుందార్ ని ఎంచుకుంది. ఏప్రిల్‌ 7 నుంచి ఈ ఏడాది ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభంకానుంది. ముంబయిలోని వాంఖడే మైదానంలో డిపెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఏప్రిల్‌ 9న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్థాన్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది. హైదరాబాద్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.