మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి తిట్టినా నాకు ఆశీర్వాదమే: తమన్‌

వాస్తవం సినిమా: మోహన్‌బాబు లాంటి సీనియర్‌ నటులు తనను విమర్శించినా అవి తనకు ఆశీర్వాదంలాగే తీసుకుంటానని సంగీత దర్శకుడు తమన్‌ వ్యాఖ్యానించారు. ఇంతకీ విషయం ఏమిటంటే ..గాయత్రి సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. “తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్న మాట నిజమే. నేనైతే తట్టుకోగలిగాను కానీ పని చేయడం చాలా కష్టం అతనితో. టాలెంట్ ఉంది కాని బాగా బద్ధకస్తుడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సంఘటన జరిగిన చాలా రోజులు తర్వాత తమన్ స్పందించారు. పాటలు ఇవ్వడం ఎందుకు ఆలస్యమైందో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. గాయత్రికి మంచి మ్యూజిక్ ఇవ్వాలని అనుకున్నారని, అందుకే కొంత సమయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి తిట్టినా అది తనకి ఆశీర్వాదం లాంటిదేనని వ్యాఖ్యానించారు.