మళయాళ చిత్రం రీమేక్ కి సిద్దమవుతున్న వెంకీ

వాస్తవం సినిమా: గతంలో పలు రీమేక్‌ చిత్రాలతో సూపర్‌ డూపర్‌ హిట్‌లను అందుకున్న వెంకటేష్‌ మరోసారి ‘గ్రేట్‌ ఫాదర్‌’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాదు. తాజాగా వెంకీ ఒక మలయాళ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆట నాదే వేట నాదే’ చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం ఆ మలయాళ చిత్రం రీమేక్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. మలయాళంలో మమ్ముటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది గ్రేట్‌ ఫాదర్‌’ అనే చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్న బడ్జెట్‌ చిత్రంగా రూపొంది పెద్ద విజయాన్ని ఆ చిత్రం సొంతం చేసుకుంది. ఆ కారణంగానే వెంకీకి ఆ సినిమాపై ఆసక్తి కలిగింది. తాజాగా ఆ చిత్రాన్ని చూసిన వెంకీ నచ్చి, మెచ్చి రీమేక్‌ రైట్స్‌ తీసుకునేందుకు సిద్దం అయ్యాడు. వెంకటేష్‌ వయసుకు మరియు బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ సినిమా అవ్వడంతో తెలుగులో తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.