చైనా ఉత్పత్తుల పై భారీ గా పన్ను పోటు కు సిద్దమైన ట్రంప్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై పలు దేశాలకు 25%, 10% చొప్పున సుంకాలను ప్రకటిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చర్యలు అంతటి తో ఆగేలా కనిపించడం లేదు,దాదాపు 4 లక్షల కోట్ల చైనా ఉత్పత్తులపై కూడా భారీగా పన్ను పోటు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్‌ రంగాలను టార్గెట్‌గా చేసుకుని, 60 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై టారిఫ్‌లు విధించాలని ట్రంప్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన సంబంధిత వ్యక్తులు తెలిపారు. అమెరికా ట్రేడ్‌ యాక్ట్‌ 1974 కింద మేథో సంపత్తి విచారణ సెక్షన్‌ 301తో ఈ టారిఫ్‌లు అసోసియేట్‌ అవుతాయని ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, టెలికాం రంగాలను టార్గెట్‌గా చేసుకుని, ఈ టారిఫ్‌లను విధించబోతున్నారని వారు పేర్కొన్నారు. అయితే దీనిపై వైట్ హౌస్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు గానీ స్పందించడానికి కూడా నిరాకరించినట్లు తెలుస్తుంది.