ఉగాది సందర్భంగా మార్చి 18 నుంచి ప్రారంభం అవుతున్న  నాగ్, నానిల చిత్రం

వాస్తవం సినిమా: యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ భారీ మల్టీస్టారర్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టి. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఉగాది సందర్భంగా మార్చి 18 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్మాత సి.అశ్వనీదత్ చిత్ర విశేషాలను మీడియాకు వెల్లడించారు.వైజయంతి మూవీస్ బ్యానర్‌లో మణిశర్మ సంగీతం అందించిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్లు అయ్యాయని అశ్వనీదత్ అన్నారు. ఈ సినిమా కూడా మ్యూజికల్‌గా పెద్ద హిట్ చేయాలనే పట్టుదలతో చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమాలోని పాటలను మణిశర్మ అమెరికాలో కంపోజ్ చేస్తున్నారని వెల్లడించారు. ‘మూడు పాటలకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ అమెరికాలో జరుగుతున్నాయి. మార్చి 18న ఉగాది పురష్కరించుకుని రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. మా బ్యానర్‌లో ఎన్నో మల్టీస్టారర్స్‌ చేశాం. అవన్నీ కమర్షియల్‌గా ఘనవిజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు నాగార్జున, నాని కాంబినేషన్‌లో చేస్తున్న మల్టీస్టారర్‌ కూడా పెద్ద విజయం సాధించి మా బ్యానర్‌కు మరింత మంచి పేరు తెస్తుంది’ అశ్వినీదత్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి శ్యామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వెంకట్ డి. పట్టి, శ్రీరామ్ ఆర్. ఇరగం మాటలు అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు చేపడుతున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం టి. శ్రీరామ్‌ ఆదిత్య.