అవన్నీ అవాస్తవాలే: గౌత‌మి

వాస్తవం సినిమా: త‌న కూతురు సినిమాల్లోకి వస్తున్న‌ట్టుగా జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని హీరోయిన్ గౌత‌మి ఖండించింది. అర్జున్ రెడ్డి త‌మిళ్ రీమేక్ వ‌ర్మ‌లో గౌత‌మి కూతురు సుబ్బల‌క్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న‌ట్టు సోషల్ మీడియాలో వార్త‌లొచ్చాయి. దీనిపై గౌత‌మి స్పందించింది. ఈ వార్త‌ల్లో ఎంత‌మాత్రం నిజం లేద‌ని ఆమె స్ప‌ష్టంచేసింది. త‌న కూతురు సినిమాల్లో న‌టిస్తోందంటూ వ‌చ్చిన వార్త‌లు చూసి షాకయ్యాన‌ని, సుబ్బల‌క్ష్మి ప్ర‌స్తుతం చ‌దువుకుంటోంద‌ని, ఇప్ప‌టికైతే త‌న‌కు న‌ట‌న‌పై ఎలాంటి ఆలోచ‌న‌లూ లేవ‌ని గౌత‌మి స్ప‌ష్టంచేసింది. త‌న కుమార్తెపై అంద‌రూ చూపుతున్న అభిమానానికి ధ‌న్య‌వాదాలు తెలిపింది.