117 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని నిలిపివేసిన ట్రంప్!

వాస్తవం ప్రతినిధి: 117 బిలియన్ డాలర్లు విలువ చేసే ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలుపుదల చేశారు. సింగపూర్‌కు చెందిన బ్రాడ్‌కామ్‌ అనే సంస్థ 117 బిలియన్‌ డాలర్లు విలువచేసే అమెరికాకు చెందిన క్వాల్‌కామ్‌ అనే చిప్స్‌ సంస్థను టేకోవర్‌ చేసుకునే ఓ పెద్ద వ్యాపార లావాదేవీని కుదుర్చుకుంది. అయితే జాతీయ భద్రత ను కారణంగా చూపుతూ ఆ ఒప్పందాన్ని నిలుపుదల చేయమని ట్రంప్ మంగళవారం ఆదేశించారు. ప్రతిపాదిత ఆ టేకోవర్‌ను తక్షణం శాశ్వతంగా రద్దు చేసుకోమని ట్రంప్ ఆదేశించారు. ఏ రూపంలోనై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మరే రూపంలోనైనా కొనుగోలుదారుడు క్వాల్‌కామ్‌ను తీసుకోవడాన్ని నిషేధించామంటూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అమెరికా అధ్యక్షుని ఉత్తర్వులను సమీక్షిస్తున్నామని బ్రాడ్‌కామ్‌ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.