హరియాణాలో దారుణ సంఘటనలు!

వాస్తవం ప్రతినిధి: హరియాణాలో రెండు దారుణ సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ విద్యార్థి.. లెక్చరర్‌పై కాల్పులకు తెగబడడం తో ఈ ఘటనలో లెక్చరర్‌ మృతిచెందారు. సోనిపట్‌ జిల్లాలోని ఖార్‌ఖోడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థి తుపాకీతో లెక్చరర్‌ రాజేష్‌ సింగ్‌పై కాల్పులు జరిపాడు. అయితే ప్రస్తుతం ఆ విద్యార్థి పరారీలో ఉన్నాడని త్వరలోనే అతన్ని పట్టుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు, మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అలానే గుర్‌గ్రామ్‌ లో బాద్‌షాపూర్‌లో నివసించే దంపతులపై గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు తెగబదినట్లు తెలుస్తుంది. దీనితో ఈ దాడిలో భర్త తీవ్రంగా గాయపడడం తో ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందగా, భార్య మాత్రం స్వల్ప గాయాలతో బయపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ కాల్పుల ఘటనలో టిల్లు అనే రౌడీ షీటర్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీ లో ఉండడం తో అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.