సుమంత్ తదుపరి సినిమాకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి

వాస్తవం సినిమా: తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ నిదానంగా ఒక్కో సినిమా చేసుకుంటూ ఇప్పటివరకూ 24 సినిమాలు పూర్తి చేసిన సుమంత్ .. తన 25వ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ‘ఉగాది’ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకు, హైదరాబాద్ .. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. బొగ్గరం ధీరజ్ .. బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.