వైకాపా లో చేరిన కాంగ్రెస్ పార్టీ నేత చేజర్ల నారాయణరెడ్డి

వాస్తవం ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నేత చేజర్ల నారాయణరెడ్డి వైకాపాలో చేరారు. గుంటూరు జిల్లాలో తన అనుచరులతో సహా వచ్చి జగన్ ను కలిసిన చేజర్ల వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం బాపట్లలో ఉన్న జగన్, చేజర్లను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువాను కప్పారు. చేజర్లతో పాటు కళ్లం హరినాథరెడ్డి తదితరులు వైసీపీలో చేరారు. కాగా, బాపట్ల నియోజకవర్గంలో ప్రవేశించిన జగన్ కు ప్రజల నుంచి ఘనస్వాగతం లభించింది. జగన్ సైతం ప్రజా స్పందనను చూసి మరింత ఉత్సాహంగా నడుస్తున్నారు. నేడు గుంటూరు జిల్లాలో రెండో రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది.