విచారణ నుంచి తప్పుకోవడానికి మెరుపు ఎన్నికల వైపు అడుగులు వేస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని

వాస్తవం ప్రతినిధి: ఇజ్రాయెల్ లో హఠాత్తుగా ఎన్నికల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, ఆయన సన్నిహిత సహచరులు అవినీతి నేరాభియోగాలకు సంబంధించిన నాలుగు కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణల విచారణల నుండి తప్పించుకునేందుకే ఈ ‘మెరుపు’ ఎన్నికలవైపు అడుగులేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నెతన్యాహు స్వయంగా దేశంలో కృత్రిమ రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి హఠాత్తుగా ఎన్నికల నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆయన నేతృత్వంలోని సంకీర్ణ కూటమి భాగగస్వాములే విమర్సిస్తుండడం విశేషం. ప్రధాని నెతన్యాహూ జూన్‌లో పార్లమెంట్‌ ఎన్నికలకు ఆదేశించే అవకాశాలున్నాయంటూ ఆదివారం నాడు ఇజ్రాయిలీ మీడియా పేర్కొనడంతో ఆయనపై భాగస్వామ్య పక్షాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.