ప్రసంగం సమయంలో పేపర్లు,హెడ్ ఫోన్లు విసిరిన కాంగ్రెస్ సభ్యులు….స్వామి గౌడ్ కంటికి గాయం

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సభను ఉద్దేశించి తొలుత గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు పేపర్లు, హెడ్‌ఫోన్లు విసిరారని, దానితో ఆయన కంటికి గాయమైనట్లు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. ఈ నేపధ్యంలో వెంటనే స్వామిగౌడ్ సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం ముగిశాక కాంగ్రెస్ సభ్యులు హెడ్‌ఫోన్ విసిరితే తన కంటికి తగిలిందని తెలిపిన ఆయన గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు లేవని అన్నారు. అలానే ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు అందరికీ ఉంటుంది. కానీ ప్రతిపక్షాలు సమస్యలపై సభలో ప్రస్తావించాలి..అంతేకానీ ఈ విధంగా దాడులకు దిగటం మంచి సంప్రదాయం కాదని స్వామి గౌడ్ సూచించారు.