ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది: గవర్నర్ నరసింహన్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొమ్మిదో సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. . అసెంబ్లీ ప్రాంగణంలో గవర్నర్‌కు శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంత నరసింహాచార్యులు స్వాగతం పలికారు.ఉదయం పది గంటలకు అసెంబ్లీ హాలులో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగించారు . ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నరసింహన్ అన్నారు. రైతులకు గోదావరి, కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు సాఫీగా సాగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం ఉభయసభలు వాయిదా పడ్డాఇ.మంగళవారం నుంచి ఉభయసభల సమావేశాలు కొనసాగుతాయి.