మడగాస్కర్,మారిషస్ లో పర్యటించనున్న రాష్ట్రపతి

వాస్తవం ప్రతినిధి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్‌, మారిషస్‌ ద్వీపాల్లో పర్యటించనున్నట్లు తెలుస్తుంది. ఆ ద్వీపాల్లో సుమారు ఐదు రోజుల ఆయన పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ పర్యటన నిమిత్తం రామ్‌ నాథ్‌ కోవింద్‌ ఈ రోజు భారత్‌ నుండి బయలుదేరారు. మారిషస్‌ స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసుకుంటున్న ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొంటున్నారు. రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు అశ్వినీ కుమార్‌ చౌబే, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు, ఎంపీ మనోజ్‌ తివారీ, హుకుమ్‌ దేవ్‌ నారాయణ్‌ యాదవ్‌, ఆర్‌ రాధాకృష్ణ‌న్‌, విజిలా సత్యనాథ్‌, భారత్‌ లాల్‌, రుచి ఘన్‌శ్యామ్‌, జైదీప్‌ మజుందార్‌, మనోజ్‌ యాదవులు కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది.