పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన దినకరన్

వాస్తవం ప్రతినిధి: ఆర్‌కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ఈ రోజు సంచలన ప్రకటన చేశారు. త్వరలో నూతన పార్టీని స్థాపించనున్నట్లు ఆయన తాజాగా ప్రకటించారు. అమ్మ(జయలలిత), చిన్నమ్మ(వి.కే.శశికళ) ఆశీస్సులతో మధురై జిల్లాలోని మేలూర్‌లో ఈ నెల 15వ తేదీన పార్టీ పేరును, గుర్తును ప్రకటించడంతో పాటు జెండాను కూడా ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. ద్రోహుల నుంచి ఏఐఏడీఎంకేను తిరిగి పొందేందుకు ఒక కొత్త రాజకీయపార్టీ అవసరమౌతుందని అందుకే తానూ త్వరలో పార్టీ ని పెట్టబోతున్నట్లు దినకరన్ వివరించారు. అయితే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న రోజే దినకరన్ పార్టీ ప్రకటన చేస్తుండడం విశేషం. ఇప్పటికే దినకరన్ గ్రూప్‌లో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది.